![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -644లో.....బావ నాకు కావాలి.. నేను పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న అనగానే అది జరగని పని దీప వార్నింగ్ ఇస్తుంది. బావ చేత్తో నా మెడలో తాళి కట్టించుకోకపోతే నా పేరు జ్యోత్స్న కాదని జ్యోత్స్న ఛాలెంజ్ చేస్తుంది. నా దగ్గర ఏం లేదని భయపడాలి.. నా దగ్గర మీ నాన్న, అమ్మ, తాత ఇల్లు ఆస్తులన్నీ ఉన్నాయి. నీ దగ్గర ఏం ఉందే అనాధ అని దీపని జ్యోత్స్న అంటుంది. నా దగ్గర బావ ఉన్నాడని కార్తీక్ పక్కకు వెళ్తుంది దీప. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నువ్వే ప్రాణం అనుకుంటున్న మనిషి నా దగ్గర ఉన్నాడు..నాకు సొంతమై ఉన్నాడు..నాతో బ్రతుకుతున్నాడు..నా కడుపులో ప్రతిరూపంగా పెరుగుతున్నాడని దీప మాట్లాడుతుంటే జ్యోత్స్న మొహం వాడిపోతుంది.
నా పాపిట్లో సింధూరంలా మెరుస్తున్నాడు.. నా మెడలో మంగళసూత్రంలా గుండెలని అంటిపెట్టుకొని ఉన్నాడు.. ఇప్పుడు చెప్పు ఎవరు నిజమైన అనాధ అని జ్యోత్స్నతో దీప అంటుంది. ఒక పని చేద్దాం.. మనిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం.. నువ్వు బావని నాకు ఇచ్చేయ్.. నీకు నేను మీ వాళ్ళని ఇచ్చేస్తానని జ్యోత్స్న అంటుంది. కావాలంటే డిస్కౌంట్ గా నాకు బావకి పుట్టబోయే బిడ్డకి నీ పేరు పెడతానని జ్యోత్స్న ఆఫర్ ఇస్తుంది. బుర్ర సరిగ్గా పనిచేసే ఏ ఆడది మొగుణ్ణి వదులుకోదని దీప అంటుంది. దీప వాళ్ళ అమ్మ బ్రతకాలంటే కూతురిగా నేనే ఉండాలని జ్యోత్స్న అంటుంది. నా బావని నాకు ఇచ్చేయ్ అని జ్యోత్స్న అనగానే మెడలో తాళి కట్టించుకోవడం కాదు కదా..నా బావ చిటికెన వేలు కూడా తాకనివ్వనని దీప అనగానే సూపర్ మరదలా అంటూ కార్తీక్ విజిల్ వేస్తాడు. ఇది మారదు బావ అని కార్తీక్ ని తీసుకొని దీప అక్కడ నుండి వెళ్తుంది. ఆ తర్వాత జ్యోత్స్న ఇంటికి వెళ్తుంది. దీప తనని చెంపపై కొట్టిన ముద్ర అలాగే ఉంటుంది. అది కవర్ చేస్తూ ఇంటికి వెళ్తుంది. అయినా శివన్నారాయణ చూసి ఏమైంది అంటాడు. సమ్మర్ కదా రాషెస్ అని జ్యోత్స్న కవర్ చేస్తుంది. నా కూతురు గట్టిగానే ఇచ్చినట్లు ఉందని దశరత్ అనుకుంటాడు.
ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వెళ్లి దీప గట్టిగానే ఇచ్చినట్లు ఉందని వెటకారంగా మాట్లాడుతుంది. నువ్వు ఇంకొకసారి దీప జోలికి వస్తే మాత్రం ఊరుకోనని జ్యోత్స్నకి పారిజాతం వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు దీప, కార్తీక్ ఇంటికి వెళ్తారు. ఆ జ్యోత్స్న ఇదంతా కావాలనే చేస్తున్నట్లు ఉంది.. దానితో జాగ్రత్త అని కాంచన చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |